జగన్ ఆదేశాలు పాటించకపోతే స్పీకర్‌కు నిద్రపట్టదు: జవహర్
ABN, First Publish Date - 2020-12-05T18:57:15+05:30
జగన్ ఆదేశాలు పాటించకపోతే స్పీకర్‌కు నిద్రపట్టదని మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ అన్నారు.
అమరావతి: జగన్ ఆదేశాలు పాటించకపోతే స్పీకర్‌కు నిద్రపట్టదని మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ అన్నారు. రైతుల సమస్యలు, పింఛన్ల గురించి చర్చించమంటే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు స్వార్థ ప్రయోజనాలకై ప్రయత్నిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ కారణంగా రాష్ట్ర డీజీపీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అశాంతికి గురవుతున్నారని జవహర్ తెలిపారు.
Updated Date - 2020-12-05T18:57:15+05:30 IST