ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదవారి పథకాలన్నీ వైసీపీ నాశనం చేసేసింది: బొండా ఉమా

ABN, First Publish Date - 2020-10-01T18:31:30+05:30

చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారి భౌతికాయాన్ని  స్వగ్రామానికి పంపేవారని.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అది రద్దు చేశారన్నారు. చంద్రన్న భీమా, పెళ్లి పథకం, అన్న కాంటీన్ వంటి ప్రజా పథకాల్ని రద్దు చేసారని మండిపడ్డారు. దక్షిణ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా చంద్రబాబు హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో అంతిమ యాత్ర భవన్ నిర్మించారని తెలిపారు. అద్దె ఇళ్లల్లో భౌతికకాయాన్ని ఉంచేందుకు యజమానులు ఒప్పుకునేవారు కాదని...వారికి అండగా ఉండి భౌతికకాయాన్ని సొంతవారు  చూసుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 70 లక్షలతో  ఆ భవన్‌ను నిర్మించారని చెప్పారు.  


16 నెలలలో వైసీపీ పాలనలో ప్రజలకు ఉపాయపగపడే పథకాలు ఏమి ప్రవేశపెట్టలేదని ఆయన విమర్శించారు. అడవిపందుల చేనులో పడితే ఎలా నాశనం అవుతుందో అలాగే పేదవారి పథకాలన్ని  వైసీపీ నాశనం చేసేసిందని మండిపడ్డారు. రజకులకు మొదటిగా రజక కల్యాణ మండపాన్ని నిర్మిస్తే సచివాలయం చేసారన్నారు. రజక కల్యాణ మండపాన్ని  తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. వారికంటూ మండపం ఉండటం ప్రభుత్వంకి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, కాపు, బ్రాహ్మణ  కార్పొరేషన్‌లు తమ కుర్చీ తాము తెచ్చుకొనేటట్టు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ వారికీ లోన్లు ఇవ్వడంలేదన్నారు. ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.  గెలిపించిన వారినే ప్రభుత్వం  అణిచివేస్తుందని బొండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-01T18:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising