ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేత్రస్థాయి పరిశీలన శూన్యం

ABN, First Publish Date - 2020-12-05T06:01:23+05:30

క్షేత్రస్థాయి పరిశీలన శూన్యం

దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న మాజీమంత్రి ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇబ్రహీంపట్నం, డిసెంబరు 4: నివర్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన నాథుడు లేడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటుపల్లిలో శుక్రవారం తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పసుపు చైతన్యంలో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టవద్దని నిరసన తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరి స్థితులకు విరుద్ధంగా పంట నష్టం వివరాలు నమోదు చేసి రైతులను గందర గోళానికి గురి చేస్తున్నారన్నారు. తడిసి, రంగు మారి, మొలకెత్తిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని చంద్రబాబు అసెంబ్లీలో మేల్కొల్పడంతో రాత్రికి రాత్రి పంటల బీమా చెల్లించిందన్నారు. రైతులు, కౌలు రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టేందుకు రైతులెవ్వరూ సంతకాలు పెట్టవద్దని సూచించారు.  రైతులు, ప్రజ ల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటానన్నారు. రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, రామినేని రాజశేఖర్‌, చెరుకూరి వెంకటకృష్ణ, నల్లూరి సూరిబాబు, జాస్తి రామకృష్ణ, సుంకర విష్ణుకుమార్‌, జాస్తి గోపాలకృష్ణ, చెరుకూరి వెంకట్రావ్‌, సీహెచ్‌ చిట్టిబాబు, చుట్టుకు దురు శ్రీనివాసరావు, పెదర్ల రవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T06:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising