ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల పెంపుపై నిరసన వెల్లువ

ABN, First Publish Date - 2020-12-03T06:52:40+05:30

ఆస్తి, నీటి పన్ను పెంపు నిరసిస్తూ సీపీఎం నాయకులు జీవో ప్రతులను దహనం చేశారు.

బందరులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బందరు, పెడన, గుడివాడల్లో ధర్నాలు

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 2 : నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీల చట్టాలను సవరించి,  ఆస్తి, నీటి పన్ను పెంపు  నిరసిస్తూ సీపీఎం నాయకులు జీవో ప్రతులను దహనం చేశారు. బుట్టాయిపేట సెంటర్‌లో సీపీఎం నాయకులు చౌటపల్లి రవి, కొడాలి శర్మ, ఎస్‌.ధనుంజయరావు, బి.సుబ్రహ్మణ్యం, సిహెచ్‌. జయరావు, టి. చంద్రపాల్‌, పరసా లక్ష్మిలు ప్రభుత్వం జారీ చేసిన 196, 197, 198 జీవో కాపీలను దహనం చేశారు.  సీపీఎం నగర కార్యదర్శి చౌటపల్లి రవి మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి జీవోలను ఉపసంహరించాలన్నారు. గుడివాడటౌన్‌ :  పన్నుల భారం పెంచుతూ ఆర్డినెన్స్‌ 16ను తేవడానికి నిరసనగా   ఆధ్వర్యంలో బుధవారం కొత్త మునిసిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.  జీవో నెంబరు 196, 197, 198లను తక్షణం రద్దు చేయాలని నినాదాలు చేశారు.   సీపీఎం జిల్లా కమిటీ నాయకుడు ఆర్‌సిపి.రెడ్డి  సీఐటీయూ పట్టణ కార్యదర్శి టి.లక్ష్మణరావు , సీపీఎం నాయకులు యేసయ్య, కె.చలపతిరావు, శొంఠి ఉమామహేశ్వరరావు, పి.రజని, షౌకతున్నీసా పాల్గొన్నారు.  పెడన : సీపీఎం ఆధ్వర్యంలో  మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బుధవారం ధర్నా, ఆందోళన నిర్వ హించారు.  సీపీఎం రాష్ట్ర నాయకుడు సజ్జా నాగేశ్వ రరావు మాట్లాడుతూ, సంస్కరణల చట్టం వల్ల పట్ట ణాలలో ఇంటి పన్నులు నాలుగు రెట్లు పెరుగు తాయని ఆందోళన వ్యక్తం చేశారు.   ఇంటి పన్నుల పెంపు జీవో కాపీలను దహనం చేశారు.  సీపీఎం నాయకులు పంచల నరసింహారావు, గోరు రాజు, వాసా గంగాధరరావు, పేరయ్యలింగం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T06:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising