ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముదినేపల్లి ఎంఈవో సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2020-12-19T06:02:07+05:30

వివిధ అభియోగాలు ఎదుర్కొన్న ముదినేపల్లి మండల విద్యాధికారి బి.శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదినేపల్లి, డిసెంబరు 18 : వివిధ అభియోగాలు ఎదుర్కొన్న ముదినేపల్లి మండల విద్యాధికారి బి.శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. సుదీర్ఘకాలం విచారణలు జరిపి చర్యలు తీసుకోవటంలో విద్యాశాఖ అధికారులు తాత్సారం చేసినా చివరికి ఎంఈవో సస్పెండ్‌ కాక తప్పలేదు. ఆయనపై మండలంలోని గురజ-టు ఎలిమెంటరీ పాఠశాల హెచ్‌ఎం రజిత, పెదపాలపర్రు హైస్కూలు కాంప్లెక్స్‌ సీఆర్పీ విజయదుర్గ ఈ ఏడాది ఫిబ్రవరిలో లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలతో ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేయడంతో పాటు ముదినేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీటిపై శాఖాపరమైన విచారణ జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎంఈవోకు వ్యతిరేకంగా పోరాడాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల ‘కీచక అధికారికి రక్ష’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించింది. రాష్ట్ర విద్యాశాఖ మోడల్‌ స్కూల్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తెహ్రాన్‌ సుల్తానా కూడా పూర్తిస్థాయి విచారణ నిర్వహించి సమర్పించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ కాకినాడ, ఆర్జేడీ నరసింహరావు శుక్రవారం ఎంఈవోను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  


Updated Date - 2020-12-19T06:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising