ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు?

ABN, First Publish Date - 2020-05-09T07:24:33+05:30

స్క్యూబ్రిడ్జి వైపు నుంచి బెంజ్‌సర్కిల్‌ మీదుగా మహాత్మాగాంధీ రోడ్డులోకి లాక్‌డౌన్‌ సమయంలో వెళ్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల కొత్త ఆలోచన


ఆంధ్రజ్యోతి - విజయవాడ : స్క్యూబ్రిడ్జి వైపు నుంచి బెంజ్‌సర్కిల్‌ మీదుగా మహాత్మాగాంధీ రోడ్డులోకి లాక్‌డౌన్‌ సమయంలో వెళ్తున్న వాహనాల సంఖ్య గంటకు 650కి పైనే. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వైపు నుంచి బెంజ్‌సర్కిల్‌ మీదుగా రామవరప్పాడు వైపు గంట వ్యవధిలో వెళ్తున్న వాహనాలు సుమారు 500. వాటిలో సగానికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉంటున్నారు. పోలీసులు వాహనదారులను ఆపి వివరాలు అడిగినప్పుడు ఎక్కువ మంది మున్సిపల్‌, వైద్యఆరోగ్య శాఖ, రెవెన్యూ, సీఆర్డీఏ, బ్యాంకు ఉద్యోగులమని చెబుతున్నారు. ఒక ప్రాంతం నుంచి ఎక్కువమంది ఒకే శాఖలో ఉద్యోగానికి వెళ్తే వారి కోసం ఒక బస్సును ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అధికారులున్నారు. ఉదాహరణకు చిట్టినగర్‌ కూడలిలో పోలీసులు సర్వే చేస్తున్నప్పుడు అక్కడి నుంచి సుమారు 50 మంది వరకు వీఎంసీలో ఉద్యోగాలకు వెళ్తున్నామని చెప్పారు. ఈ లెక్కన 50 వాహనాలు వీఎంసీ ఉద్యోగులవే బయటకు వస్తున్నాయి.


వాళ్లంతా చిట్టినగర్‌ నుంచే విధులకు వెళుతున్నారు కాబట్టి వారి కోసం రెండు బస్సులను ఏర్పాటు చేస్తే, ఈ 50 వాహనాలు రహదారుల పైకి రావడం తగ్గుతుందన్న భావనలో అధికారులు ఉన్నారు. నగరంలో కొద్ది రోజుల క్రితం తొలి విడత సాయంత్రం వేళ సర్వే నిర్వహించారు. తాజాగా మరో విడత శుక్రవారం ఉదయం సర్వే చేశారు. మొదటిసారి విధుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనాలను లెక్కించారు. రెండోసారి చేసిన సర్వేలో ఇంటి నుంచి కార్యాలయాలకు వెళ్లే వాహనాలను లెక్కించారు. బెంజ్‌సర్కిల్‌, రామవరప్పాడురింగ్‌, తాడిగడప, డాబాకొట్టు సెంటర్‌, చిట్టినగర్‌ ప్రదేశాల్లో ఈ సర్వే చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరులు ఎంతమంది వస్తున్నారన్న లెక్కలను పోలీసులు తీశారు.


ముఖ్యంగా విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు కట్టడి కాకపోవడం, ఎన్ని నిబంధనలు విధించినా, లాక్‌డౌన్‌ సమయంలో సైతం విచ్చలవిడిగా రహదారులపైకి వాహనాలు రావడం, ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డో, పోలీసులు జారీచేసిన పాసో చూపించడంతో వదిలేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల లెక్క తేలిపోతే మిగిలిన వాహనాలను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత మంది వెళ్తున్నారో లెక్క తేల్చి వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఇది ఎంత వరకు అమల్లోకి వస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2020-05-09T07:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising