ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు బేడీలపై ఎస్పీ సీరియస్..6 గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

ABN, First Publish Date - 2020-10-28T18:38:13+05:30

రైతులకు బేడీలు వేయడంపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రైతులకు బేడీలు వేయడంపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు. ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేశారు. ఆర్ఎస్ఐ, ఆర్ఐలకు చార్జ్ మెమో ఇచ్చారు. అంతేకాకుండా అడిషనల్ ఎస్పీతో విచారణ కమిటీని నియమించారు. రాజధాని రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెంకు చెందిన రాజధాని రైతులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.


అయితే రైతులకు బేడీలు వేయడంపై అమరావతి పరిరక్షణ సమితి, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎస్పీ విశాల్ గున్ని చర్యలకు ఉపక్రమించారు. రైతులకు బేడీలు వేసి.. జిల్లా జైలుకు తరలించేందుకు ఎస్కార్ట్‌గా వచ్చిన ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేస్తూ.. దీనిపై కమిటీని నియమిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - 2020-10-28T18:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising