ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2020-07-14T09:53:00+05:30

కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు. బందరు డివిజన్‌లో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. చిలకలపూడి వరలక్ష్మీ పాలిటెక్నిక్‌ కళాశాలలో 60 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. మాస్కు లు ధరించని వారికి జరిమానా విధించాలని పోలీసులకు కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్డీవో ఖాజావలి, మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌. శివరామకృష్ణ, డీఎస్పీ మెహబూబ్‌ బాషా, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాయక్‌, డాక్టర్‌ అమృత, కొవిడ్‌ వైద్యాధికారి బాలసు బ్రహ్మణ్యం, తహసీల్దార్‌ సునీల్‌బాబు తదిత రులు పాల్గొన్నారు.


2 గంటల వరకే షాపులు

గుడివాడ  : డివిజన్‌లో మొత్తం 38 కరోనా కేసులు నమోదైనట్లు ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ తెలిపారు. సత్యనారాయణపురంలో కొత్తగా కరోనా కేసులు బయటపడడంతో కంటైన్మెంట్‌ జోన్‌ను కొనసాగిస్తున్నామన్నారు. పట్టణంలో మంగళవారం నుంచి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతిస్తామన్నారు. 


పేటలో మరో ఏడు..

జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలో మరో ఏడు గురు వైరస్‌ బారిన పడ్డారు.  నందిగామ రూరల్‌, :  బేతాళ చర్చి వద్ద నివాసముండే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. హైదరాబాద్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ నందిగామ వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేయగా, పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో విజయవాడ క్వారంటైన్‌కు తరలించారు. 

Updated Date - 2020-07-14T09:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising