ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవర్లకు ఉత్తమ భవిష్యత్‌

ABN, First Publish Date - 2020-11-26T06:24:16+05:30

డ్రైవర్లకు ఉత్తమ భవిష్యత్‌ ఉందని ఆర్టీసీ ఈడీ జి.వెంకటేశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ పొందిన డ్రైవర్లకు ఈడీ సర్టిఫికెట్లు అందచేశారు.

శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందచేస్తున్న ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌: డ్రైవర్లకు ఉత్తమ భవిష్యత్‌ ఉందని ఆర్టీసీ ఈడీ జి.వెంకటేశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ పొందిన డ్రైవర్లకు ఈడీ సర్టిఫికెట్లు అందచేశారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ, విదేశాలలో డ్రైవర్లు అధికారులతో సమానంగా వేతనాలు పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల కొరత ఉందన్నారు. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ కె. నాగేంద్రప్రసాద్‌, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస నాయక్‌, డిప్యూటీ సీపీఎం జాన్‌ సుకుమార్‌ మాట్లాడారు. డిపో మేనేజర్‌ పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పొందిన డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు.

చెన్నైకు సర్వీసులు ప్రారంభం : ఈడీ  

 ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన పరిధిలోని మూడు జిల్లాల్లో 35 డిపోల్లో కరోనా అనంతరం బస్సు సర్వీసులు పునరుద్ధరించామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సర్వీసులు నడపకపోవడం వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లిందన్నారు. చెన్నైకు బసు సర్వీసులు ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌కు 150 సర్వీసులు నడుపుతున్నామన్నారు. 

 

Updated Date - 2020-11-26T06:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising