ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారులతో నూజివీడును అనుసంధానించండి

ABN, First Publish Date - 2020-12-28T06:03:37+05:30

జాతీయ రహదారులతో నూజివీడును అనుసంధానించండి

కేంద్రమంత్రి మురళీధరన్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు, డిసెంబరు 27: చెన్నై, కోలకతా, ఛత్తీస్‌ఘడ్‌ జాతీయ రహదారులకు నూజివీడును అనుసంధానం చేస్తూ లింకు రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పి.మురళీధరన్‌ హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు వచ్చిన కేంద్రమంత్రిని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నాయకులు బోను అప్పారావు, మాటూరి రవికాంత్‌ కలిసి లింకు రహదారుల నిర్మాణంపై వినతి పత్రం సమర్పించారు. మెట్ట ప్రాంతమైన నూజివీడులో మామిడి, జామ, పొగాకు, మొక్కజొన్న వాణిజ్య పంటలు పండిస్తున్న రైతాంగానికి లింకురోడ్ల నిర్మాణం మేలుచేస్తుందని మంత్రికి తెలిపారు. దీంతో పూర్తిగా వెనకబడి ఉన్న నూజివీడు పారిశ్రామికంగా, వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించి కార్యాచరణకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.



Updated Date - 2020-12-28T06:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising