ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ తర్వాత కూడా.. విజయవాడలో రైళ్లకు.. ‘రెడ్’‌ సిగ్నల్‌!

ABN, First Publish Date - 2020-04-30T09:36:58+05:30

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ నుంచి ప్రయాణికుల రైళ్ల ఆపరేషన్‌కు నో!

రెడ్ జోన్లు అధికంగా ఉండటమే కారణం

పాసింగ్ త్రూ రైళ్లకే అవకాశం!


ఆంధ్రజ్యోతి, విజయవాడ: దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడ నుంచి లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రయాణికుల రైళ్లు నడిచే పరిస్థితి కనిపించటం లేదు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు సడలింపులు ఇచ్చినా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు నడిచినా, విజయవాడలో ఆగే పరిస్థితి లేదు. విజయవాడ నగరం రెడ్‌జోన్లతో నిండిపోవటమే ఇందుకు కారణం.


మే 4వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను పరిమితంగా నడపాలని, ఎక్కువగా ఇంటర్‌ స్టేట్‌ రైళ్లను నడపాలనే ఆలోచనను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రైల్వే జోన్ల నుంచి రెడ్‌జోన్‌ ఏరియాలు ఉన్న ప్రాంతాలు, వాటి పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్ల సమాచారాన్ని ఆ శాఖ కోరింది. విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ఇక్కడి రెడ్‌జోన్ల జాబితాను జోన్‌కు పంపించారు. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌ ఎంతో ప్రధానమైనది.


డివిజన్‌లో ఏ1 స్టేషన్‌గా ఉన్న విజయవాడ నుంచి ప్రతిరోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన రైల్వేస్టేషన్‌ రెడ్‌జోన్‌ పరిధిలో ఉండటంతో జోన్‌ అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. మరోపక్క పలు రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో రైళ్లను తిరగనీయమని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రైళ్లను తిప్పే విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, రైళ్లు తిరుగుతాయన్న సంకేతాలను అయితే ఇస్తున్నారు.


అయితే రెడ్‌జోన్ల నుంచి ప్రయాణికులు మరో ప్రాంతానికి ప్రయాణిస్తే కరోనా వ్యాప్తికి ఊతమిచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో వాటి పరిధిలోని స్టేషన్లలో ప్రయాణికుల రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వకూడదన్న నిబంధన తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. రైళ్లను తిప్పితే ప్రధాన జంక్షన్లకు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రిత్వశాఖ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన చూసినా విజయవాడ అతి పెద్ద జంక్షన్‌. ఒకవేళ అవకాశం వచ్చినా, రెడ్‌జోన్ల కారణంగా విజయవాడ నుంచి రైళ్లు బయలుదేరే అవకాశం ఉండదు. పై నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగే అవకాశం కూడా ఉండదు.

Updated Date - 2020-04-30T09:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising