ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయం పోయే..!

ABN, First Publish Date - 2020-04-10T10:16:57+05:30

ఒక్క నెలలోనే రైల్వే ఆదాయం తారుమారైంది. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే విజయవాడ రైల్వే డివిజన్‌ ఆల్‌టైమ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చిలో రూ.47.24 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన రైల్వే

లాక్‌డౌన్‌ ప్రభావం వల్లే..

కిందటి ఏడాదితో పోలిస్తే మాత్రం ఈసారి పెరిగిన నికర ఆదాయం

గణాంకాలను విడుదల చేసిన రైల్వే అధికారులు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఒక్క నెలలోనే రైల్వే ఆదాయం తారుమారైంది. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే విజయవాడ రైల్వే డివిజన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు ఆదాయాన్ని నమోదు చేసి ఉండేది. మార్చి చివర్లో నిరాశ పరిచినప్పటికీ కిందటి ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత 2019-20 సంవత్సరం రైల్వే అధిక ఆదాయాన్ని సాధించింది. 2018-19లో ప్రయాణికుల రవాణాపరంగా రూ.993.49 కోట్ల నికర ఆదాయాన్ని విజయవాడ రైల్వే డివిజన్‌ ఆర్జించగా, 2019-20లో మాత్రం రూ.1,002.42 కోట్లు సాధించింది.


ఇది కిందటి ఏడాది కంటే రూ.9 కోట్లు అదనం. మార్చిలో కరోనా లేకపోయి ఉంటే.. రూ.100 కోట్లు ఆర్జించి ఉండేది. కిందటి ఆర్థిక సంవత్సరం 2018-19 మార్చిలో 71,71,937 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో లాక్‌డౌన్‌ మాసంలో 43,01,553 మందే ప్రయాణించారు. ఇక.. కిందటి ఆర్థిక సంవత్సరం 2018-19 ఒక్క మార్చిలోనే రూ.86.53 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి లాక్‌డౌన్‌ కారణంగా రూ.39.30 కోట్లు మాత్రమే లభించింది. 

Updated Date - 2020-04-10T10:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising