పట్టాల పంపిణీలో రసాభాస
ABN, First Publish Date - 2020-12-29T06:16:21+05:30
మండలంలో తొలిరోజు జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది.
అర్హత ఉన్నా స్థలం రాలేదని మహిళల ఆందోళన
ముసునూరు : మండలంలో తొలిరోజు జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. పలు గ్రామాల్లో మహిళల నుంచి అందోళన వ్యక్తమైంది. అర్హత ఉన్నా ఇంటి స్థలం రాలేదని అధికారులను, ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను మహిళలు నిలదీశారు. మొండివాగు బీసీ కాలనీలో అర్హత ఉండి ఇంటి స్థలాలు రాని కొందరు మహిళలు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు గద్దె రఘుబాబు అధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రతాప్ దృషికి తీసుకువెళ్లేందకు సభ వేదిక వద్దకు వెళుతున్న క్రమంలో నాయకులు, పోలీసులు అడ్డుకోవటంతో మహిళలు, నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక వలంటరీ వల్లే ఇంటి స్థలం రాలేదని, అతని పనితీరు బాగోలేదని వెంటనే వలంటీర్‌ను తీసివేయాలని మహిళలు నినాదాలు చేశారు. అర్హత ఉండి ఇంటి స్థలం రాని వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో స్థలం, పట్టా ఇస్తామని ఎమ్మెల్యే ప్రతాప్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని రమణక్కపేట, సూరేపల్లి, చెక్కపల్లి, గుళ్లపూడి, లోపూడి, యల్లాపురం, వలసపల్లి గ్రామాల్లో సోమవారం 1273 మంంది లబ్ధిదారులకు నూజీవీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటరమణారావు, తహసీల్దార్ చిట్టిబాబు, ఎంపీడీవో సత్యనారయణ, వైసీపీ మండల కన్వీనర్ మూల్పూరి నాగమల్లేశ్వరావు, సొసైటీ అధ్యక్షుడు కోటగిరి రాజా పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T06:16:21+05:30 IST