ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు పటిష్ఠ పరీక్షలు

ABN, First Publish Date - 2020-04-08T09:58:19+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు పటిష్ఠమైన రీతిలో పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జేసీ-2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్‌-19 యాప్‌లో తాజా వివరాలు నమోదు

వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌తో జేసీ-2 మోహన్‌కుమార్‌


విజయవాడ సిటీ, ఏప్రిల్‌ 7: జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు పటిష్ఠమైన రీతిలో పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జేసీ-2 మోహన్‌కుమార్‌ తెలిపారు. కరోనా అనుమానితులను గుర్తించేందుకు రూపొందించిన కోవిడ్‌- 19 యాప్‌లో వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జేసీ- 2 పాల్గొన్నారు. 


జేసీ-2 మాట్లాడుతూ, కరోనా వైరస్‌ అనే యాప్‌ను ప్రభుత్వం డెవలప్‌ చేసి గ్రామ, వార్డు వలంటీర్ల స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానం చేసిందన్నారు. అందులో వివరాలే ఆశా వర్కర్లు, ఏఎన్‌యం, మెడికల్‌ అధికారులకు కూడా వస్తాయన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిని, బీపీ, మధుమేహం, క్యాన్సర్‌, ఊపిరితిత్తుల జబ్బులు, అస్తమా, మూత్రపిండాల వ్యాధులున్న వారిని ప్రత్యేక కేటగిరీగా గుర్తించాలన్నారు. ఈ సమాచారం ఏఎన్‌ఎంలకు వెళ్తుందన్నారు. ఏఎన్‌ఎం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడుసార్లు పరిశీలించుకోవాలన్నారు. వార్డు వలంటీర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో లేవో ఏఎన్‌ఎంలు స్వయంగా ఇంటింటికి వెళ్లి తెలుసుకోవాల న్నారు. వ్యాధి సోకవచ్చనే అనుమానం కలిగితే సంబంధిత క్లస్టర్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారం పంపాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో యాప్‌ను చూసుకుని సంబంధిత వ్యక్తి ఇంటిని సందర్శించాలన్నారు. ఆ వ్యక్తి లక్షణాలను తెలుసుకుని అవసరమైతే వెంటనే క్వారంటైన్‌కు తరలించాలన్నారు.


అనుమానిత వ్యక్తులకు పరీక్షలు జరిపిన తర్వాత క్వారంటైన్‌ సెంటర్‌లో 14 రోజులు ఉంచాలని, పాజిటివ్‌ కేసులకు ఆసుపత్రుల్లో ప్రోటోకాల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని అన్నారు. అన్ని క్వారంటైన్‌ కేంద్రాలకు లాగిన్‌ ఇస్తారన్నారు. అన్ని ఆసుపత్రులకు కూడా లాగిన్‌ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తులకు చికిత్స తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2020-04-08T09:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising