ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని.. డోర్ తెరిచి చూస్తే..

ABN, First Publish Date - 2020-07-09T16:11:02+05:30

పొందుగల గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నేత రాసలీలలు

వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడిన నేత


మైలవరం(కృష్ణా): పొందుగల గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మైలవరం పొందుగల రోడ్డులో ఈ ఘటన బుధవారం జరిగింది. తన భార్యతో ఆ వైసీపీ నేత వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానం వచ్చిన కానిస్టేబుల్ ఆయనపై నిఘా పెట్టాడు. పొందుగల రోడ్డులో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నట్టు సమాచారం అందుకున్న కానిస్టేబుల్ ఆ ఇంటికి బయట నుంచి గొళ్లెం పెట్టి మీడియాకు సమాచారం అందించాడు.


మీడియా, పోలీసుల సమక్షంలో డోర్ తీసి చూడగా కానిస్టేబుల్ భార్యకు బదులు అతని వదిన బయటకు రావడంతో అవాక్కయ్యాడు. బయటకు వచ్చిన మహిళ నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ కానిస్టేబుల్‌పై విరుచుకుపడింది. గొడవ జరగడంతో అక్కడి నుంచి వారిద్దరూ కారులో పరారయ్యారు. అనంతరం కానిస్టేబుల్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగరీత్యా తన తోడల్లుడు ఇతర ప్రాంతాల్లో ఉన్నాడని, తన కాపురంతో పాటు తన తోడల్లుడి కాపురంలోనూ ఆ వైసీపీ నేత చిచ్చు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికార పార్టీ నేత రాసలీలలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సాహసించలేదు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్సై ఈశ్వరరావు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వైసీపీ నేత తన కుటుంబం నుంచి ఒకరిని పోటీలో నిలబెట్టారు.

Updated Date - 2020-07-09T16:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising