ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లేవి?

ABN, First Publish Date - 2020-11-23T05:42:01+05:30

పంట చేతికొచ్చే దశలో మాగాణి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ పాటికే కొన్నిచోట్ల పంట చేతికొచ్చి కల్లాలపై ఉన్నా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో అన్నదాతల్లో అలజడి నెలకొంది.

కల్లాల్లో ఆరబోసి ఉన్న ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లాల్లో సిద్ధంగా ఉన్న పంట

కొనుగోలు కేంద్రాల్లేక రైతులు అవస్థలు

దళారులకు అమ్మి నష్టపోతున్న వైనం

ముసునూరు, నవంబరు 22: పంట చేతికొచ్చే దశలో మాగాణి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ పాటికే కొన్నిచోట్ల పంట చేతికొచ్చి కల్లాలపై ఉన్నా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో అన్నదాతల్లో అలజడి నెలకొంది. సొసైటీల్లో ఏర్పాటు చేయాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మండలంలో నేటికీ ప్రారంభం కాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందని రైతన్నలు వాపోతున్నారు.  

మండల పరిధిలో వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం 7 వేల ఎకరాల్లో వరి సాగైయింది. ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వారం పది రోజుల్లో నూరు శాతం కోతలు పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. చెక్కపల్లి, గుడిపాడు, లోపూడి, గోపవరం తదితర గ్రామాల్లో ధాన్యం చేతికొస్తాయి. అయితే కొనుగోలు కేంద్రాలు తెరవక పోవటం, సంచులు ఇతర సామగ్రి అందుబాటులోకి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 75 కేజీలు ఏ గ్రేడ్‌ రకం రూ.1425 ఉండగా దళారులు మాత్రం రూ.1100 నుంచి రూ.1200కు కొనుగోలు చేస్తున్నారని, ఈ ధరకు అమ్మితే బస్తాకు రూ.225 నష్టపోవాల్సి వస్తుందని, సాధారణ రకాలను అడ్డగోలుగా అడుగుతున్నారని  రైతులు వాపోతున్నారు. సొసైటీ అధికారులనూ, రైతు భరోసా సిబ్బందినీ అడిగితే పౌరసరఫరాల శాఖాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలూ, సామగ్రీ రాలేదని చెబుతున్నారనీ రైతులు అంటున్నారు. ప్రతి ఏటా రైతులకు ఉపయోగపడని సమయంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో అన్ని కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధరను అందించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తక్కువ ధరకు అమ్మలేక నిల్వ చేశా        

    ఏడెకరాల్లో ఏ గ్రేడ్‌ స్వర్ణ రకాన్ని సాగుచేశా. కోత కోసి 15 రోజులైంది. ధాన్యం పూర్తిగా ఆరుదల వచ్చాయి. కొనుగోలు కేంద్రం తెరవకపోవటంతో వ్యాపారస్తులకు చూపించా. బస్తా రూ.1200కు అడిగారు. బస్తాకు రూ.225 నష్టపోవాల్సి వస్తుంది.  

                                                                                    - గద్దె రఘుబాబు, గుడిపాడు, రైతు

తక్షణమే ధాన్యం కొనాలి 

 పలు గ్రామాల్లో 50 శాతం కోతలు పూరై ధాన్యం కల్లాలపై ఉంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే ఆవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా అదికారులు   ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే చేపట్టి  మమ్మల్ని ఆదుకోవాలి.

- కాటేపల్లి నాగేశ్వరరావు, చెక్కపల్లి, రైతు

కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తాం 

  మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. రైతులు రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ధాన్యం శ్యాంపిళ్లను పరిశీలిస్తారు.  

-పార్వతి, నూజీవీడు ఏఎస్‌ఓ


Updated Date - 2020-11-23T05:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising