ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో పడిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-11-14T00:37:20+05:30

ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలిని గూడూరు పోలీసులు బయటకు తీసి ఆమె ప్రాణాలు కాపాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, నవంబరు 12 : ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలిని గూడూరు పోలీసులు బయటకు తీసి ఆమె ప్రాణాలు కాపాడారు.  దాసంశెట్టి సావిత్రి (70) గూడూరు  టెలిఫోన్‌ ఎక్చ్సేంజ్‌ సమీపంలో ఒంటరిగా ఉంటోంది. నీరు తోడుకు నేందుకు బావి వద్దకు వెళ్లిన ఆమె బుధవారం రాత్రి బావిలో పడిపోయింది.   అటుగా వెళ్లిన కరీముల్లా అనే వ్యక్తి కేకలు విని బావిలోకి టార్చిలైటు వేసి చూడగా అందులో వృద్దురాలు పడిఉంది. వెంటనే అతను 100 నెంబరుకు  సమాచారం అందించాడు. సమీపంలో విధుల్లో ఉన్న కానిస్టబుళ్లు శివ కుమార్‌,  శ్యామ్‌  వచ్చి స్థానికుల సాయంతో  సావిత్రిని బయటకు తీసుకు వచ్చారు.   వృద్దురాలి ప్రాణాలు కాపాడిని కానిస్టేబుళ్లకు స్థానికులు కృతజ్ఞత లు తెలియజేశారు. 

Updated Date - 2020-11-14T00:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising