ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక రైలు కూత

ABN, First Publish Date - 2020-05-31T09:43:24+05:30

రెండు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి సాధారణ రైళ్లు నడవనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : రెండు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి Normal trains are expected to run. విజయవాడ మీదుగా ఏడు జతల (రాకపోకలు కలిపితే 14 రైళ్లు) నడపటానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఈ మేరకు  విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలో మొదటిది హౌరా-సికింద్రాబాద్‌ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌- నెంబర్‌ 02703/02704), రెండోది గుంటూరు-సికింద్రాబాద్‌ (గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ - 07201/07202), మూడోది హైదరాబాద్‌-విశాఖపట్నం (గోదావరి ఎక్స్‌ప్రెస్‌ - 02727/02728), నాల్గోది ముంబయి సీఎస్‌టీ-భువనేశ్వర్‌ (కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ -  01019/01020), ఐదోది దానాపూర్‌-బెంగళూరు (సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ - 02296/02295), ఆరోది విశాఖపట్నం-న్యూఢిల్లీ (ఏపీ ఎక్స్‌ప్రెస్‌ - 02805/02806), ఏడోది హౌరా-యశ్వంత్‌పూర్‌ (దురంతో ఎక్స్‌ప్రెస్‌ - 02245/02246). వీటిలో మొదటి ఆరు రైళ్లు రోజూ నడవనుండగా, దురంతో ఎక్స్‌ప్రెస్‌ మాత్రం వారంలో ఐదు రోజులే నడుస్తుంది. ఈ రైళ్లకు రిజర్వేషన్‌ ఇప్పటికే ఫుల్‌ అయిపోయింది. 


నిబంధనలు ఇవీ..

టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన ప్రయాణికులనే స్టేషన్లలోకి అనుమతిస్తారు. 

90 నిమిషాల ముందు ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి.

ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను పటిష్ఠంగా నిర్వహిస్తారు.

రైలెక్కే ప్రయాణికులు స్టేషన్‌లో ఏ ప్లాట్‌ఫాంకు రావాలో ముందే మెసేజ్‌ చేస్తారు.

ప్లాట్‌ఫాం టికెట్‌ను నిలుపుదల చేశారు. 

ప్రయాణికులు తప్పక ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

ఎంట్రీ పాయింట్లలో థర్మల్‌ స్కానింగ్‌ నిర్వహిస్తారు. కరోనా పరీక్షలు చేస్తారు.

ఎలాంటి లక్షణాలు కనిపించినా అనుమతించబోరు.

ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. 

గమ్యస్థానం చేరే వరకు మాస్క్‌ ధరించాలి.

కూలీలు ఉండరు కాబట్టి ప్రయాణికులు తక్కువ లగేజీ తెచ్చుకోవాలి. 

స్టేషన్లలో ఆహార పదార్థాల దుకాణాలు తెరిచి ఉంటాయి.

ప్రయాణికులు తమ వెంట ఆహార ప్యాకెట్లను తెచ్చుకోవచ్చు. ఫ బోగీకి 72 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రొటోకాల్‌ విధులు తప్పనిసరిగా పాటించాలి. 

Updated Date - 2020-05-31T09:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising