ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్లు, విమానాల రద్దు

ABN, First Publish Date - 2020-11-27T06:10:32+05:30

రైళ్లు, విమానాల రద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నివర్‌ తుఫాను కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి మొత్తం ఎనిమిది విమానాలను రద్దు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నడిచే ఆరు సర్వీసులను రద్దు చేయగా, చెన్నైకు వెళ్లే రెండు, కడపకు వెళ్లే ఒక సర్వీసును కూడా నిలిపివేశారు. 

పలు రైళ్లు రద్దు

చెన్నై-సంత్రాగచి (నెంబర్‌ 02808), మధురై-బికనీర్‌ (నెంబర్‌ 06053, 06054) రైళ్లు రద్దయ్యాయి. తుఫాను ధాటికి చెన్నై, రేణిగుంట, తిరుపతివైపు భారీ వర్షాలు కురవటంతో అటుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. కొన్నింటినీ దారి మళ్లించారు. బెంగళూరు-దానాపూర్‌ (నెంబర్‌ 02295), బెంగళూరు-గువహటి (నెంబర్‌ 02509), యశ్వంత్‌పూర్‌-దానాపూర్‌ (నెంబర్‌ 03210), తిరువనంతపురం-గోరఖ్‌పూర్‌ (నెంబర్‌ 02512), దానాపూర్‌-బెంగళూరు (నెంబర్‌ 02296), గువహటి-బెంగళూరు (నెంబర్‌ 02510), షాలిమర్‌- తిరువనంతపురం (నెంబర్‌ 02642) రైళ్లను జోలార్‌ పెట్టయ్‌, రేణిగుంట, గూడూరు మీదుగా మళ్లించారు. విజయవాడ డివిజన్‌ పరిధిలోని ప్రతి స్టేషన్‌లోనూ హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడలో కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధంగా ఉంచారు. 

Updated Date - 2020-11-27T06:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising