ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిసెస్‌ ఇండియా ఫైనలిస్ట్‌గా ‘బిందు మాధవి’

ABN, First Publish Date - 2020-10-27T16:14:36+05:30

మిసెస్‌ ఇండియా ఏపీ ఫైనలిస్ట్‌గా విజయవాడకు చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ(ఆంధ్రజ్యోతి): మిసెస్‌ ఇండియా ఏపీ ఫైనలిస్ట్‌గా విజయవాడకు చెందిన డాక్టర్‌ పరుచూరి బిందు మాధవి ఎంపికయ్యారు. మిసెస్‌ ఇండియా కాంపిటీషన్‌ ఆంఽద్రప్రదేశ్‌ ప్రతినిధి మమత త్రివేది ఈనెల 18న వర్చువల్‌గా ఈ పోటీలను నిర్వహించారు. రాష్ట్రాల వారీగా జరిగిన పోటీలో ఏపీ నుంచి ఫైనల్‌కు 25 మంది ఎంపికయ్యారు. వారందరినీ వెనక్కి తోసేసిన బిందు మాధవి మిసెస్‌ ఇండియా ఏపీ ఫైనలిస్ట్‌గా నిలిచారు. బిందు మాధవి పిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమెను జిల్లాపరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ తదితరులు సోమవారం ఘనంగా సత్కరించారు. గృహిణిగా, వైద్యురాలిగా, క్రీడాకారిణి రాణిస్తున్న బిందు మాధవి ఇప్పుడు మిసెస్‌ ఇండియా ఏపీ ఫైనలిస్ట్‌గా ఎంపికవ్వడం విజయవాడకే గర్వకారణమన్నారు. ఆమె జాతీయ స్థాయిలోనూ ఈ కిరీటాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2020-10-27T16:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising