ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదిహేనేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారు?

ABN, First Publish Date - 2020-12-06T14:46:26+05:30

పదిహేనేళ్లు అధికారంలో ఉండి మాజీ ఉపసభాపతి మండలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండలి బుద్ధప్రసాద్‌పై ఎమ్మెల్యే సింహాద్రి ఆగ్రహం


అవనిగడ్డ టౌన్‌: పదిహేనేళ్లు అధికారంలో ఉండి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఏం సాధించారని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవనిగడ్డలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికలయిన 18 నెలల తరువాత బయటకు వచ్చిన బుద్ధప్రసాద్‌ తన ఉనికిని కాపాడుకొనేందుకే విమర్శలు చేస్తున్నారన్నారు. డెల్టా ఆధునీకరణ పనుల్లో అవుట్‌ఫాల్‌ స్లూయీస్‌లు వెడల్పు పెంచాల్సి ఉండగా, ఆ పని చేయకుండా కాంట్రాక్టర్లకు  లాభం వచ్చే రిటైనింగ్‌ వాల్‌ పనులు చేయించారని ఆరోపించారు. దీని కారణంగానే మురుగు బయటకు పోక పంటలు ముంపునకు గురవుతున్నాయన్నారు. అహంకారంతో అటవీ శాఖ అధికారులతో విరోధం తెచ్చుకుని, ఈ ప్రాంతంలో అభివృద్ధిని బుద్ధప్రసాద్‌ ప్రశ్రార్థకం చేశారన్నారు. త్వరలోనే ఎదురుమొండి-నాచుగుంట రహదారి సమస్యను పరిష్కరిస్తానని, 18 నెలల్లో తానేం సాధించానో.. 15 సంవత్సరాల్లో బుద్ధప్రసాద్‌ ఏం సాధించారో చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్‌ విసిరారు. దివి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, రేపల్లె శ్రీనివాసరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, సామర్ల రాముడు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T14:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising