ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లేశ్వరాలయానికి మహర్దశ

ABN, First Publish Date - 2020-11-22T06:02:38+05:30

మల్లేశ్వరాలయానికి మహర్దశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రానైట్‌ రాయితో పునర్నిర్మాణం

ప్రాకార మండపాలు  కూడా..

రూ.7.5 కోట్లతో ఈ-టెండర్లు ఆహ్వానం 

15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి

మాస్టర్‌ ప్లాన్‌లో ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థానంలో నల్లరాయితో సరికొత్త ఆలయాన్ని నిర్మించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గ్రానైట్‌ రాయితో ఆలయ పునర్నిర్మాణానికి రూ.5.6 కోట్లు, చుట్టూ ప్రాకార మండపం నిర్మాణానికి  రూ.2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి త్వరలోనే పనులు చేపట్టేందుకు ఆన్‌లైన్‌లో టెండర్లను కూడా ఆహ్వానించారు. 15 రోజుల్లోగా ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఏడాదిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 

మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగానే.. 

మల్లేశ్వరాలయ అభివృద్ధికి దుర్గగుడి అధికారులు ఇప్పటికే ఒక మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిద్ధంచేసిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తొలుత రాతితో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. శివాలయం మెట్లమార్గం దిగువన, మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రూ.8.5 కోట్లతో ప్రసాదం పోటు, కనకదుర్గానగర్‌ వైపు రూ.9 కోట్లతో ఎంట్రన్స్‌ ప్లాజా, కృష్ణానది ఒడ్డున దుర్గాఘాట్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రూ.23 కోట్లతో కేశఖండనశాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. దుర్గాఘాట్‌ వద్ద కేశఖండనశాల నిర్మాణానికి అవసరమైన స్థలానికి జలవనరులశాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. ఇలా అన్ని రకాల అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా విడుదలైతే ప్రతిపాదిత అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. అయితే, మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన పనుల్లో ఇంకా మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని దుర్గగుడి వర్గాలే చెబుతున్నాయి. 

Updated Date - 2020-11-22T06:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising