ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీ సర్వే తొలిదశ పూర్తి!

ABN, First Publish Date - 2020-06-22T09:52:13+05:30

జిల్లాలోని జగ్గయ్యపేటలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ విధానంలో ప్రారంభించిన భూముల రీసర్వే తొలి దశ విజయవంతమైంది. జిల్లాలో 25 గ్రామాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలోని జగ్గయ్యపేటలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ విధానంలో ప్రారంభించిన భూముల రీసర్వే తొలి దశ విజయవంతమైంది. జిల్లాలో 25 గ్రామాల్లో భూముల రీ సర్వే నిర్వహించాలని నిర్ణయించగా.. తొలిదశలో జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో 22 రోజుల్లోనే నూరు శాతం పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా దీని అమలుకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో ప్రయోగాత్మకంగా భూముల రీ సర్వే నిర్వహించటానికి రూ.3.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో భూముల ప్రామాణికతను నూరు శాతం నిర్ణయించే కోర్స్‌ బేస్‌స్టేషన్లు - కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. జిల్లాలోని జగ్గయ్యపేట,  తిరువూరు, విజయవాడ, పెడనల్లో వీటిని ఏర్పాటు చేశారు.


జగ్గయ్యపేట మండలంలో మొత్తం 6034 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ మండలంలోని తక్కెళ్లపూడి గ్రామంలో 150 సర్వే నెంబర్లు ఉన్నాయి. మొత్తం 10 టీమ్‌లలో 12 మంది సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు మరో 20 మంది  ఇక్కడ పని చేశారు. 500 మంది రైతులు రీ సర్వేకు సహకారాన్ని  అందించారు. జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన కోర్స్‌ బేస్‌ స్టేషన్‌, అత్యాధునిక క్యూజీఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో వెబ్‌ జీఐఎస్‌ డేటా ప్రాసెసింగ్‌ ద్వారా మొత్తం భూముల రీ సర్వేను త్వరగా పూర్తి చేయగలిగారు. మే 14వ తేదీన రీ సర్వేను  ప్రారంభించగా... జూన్‌ ఐదో తేదీన రీ సర్వే పూర్తి చేశారు. 519 మంది రైతులకు సంబంధించిన 1533.66 ఎకరాల భూమి రీ సర్వే చేశారు. గుర్తించిన తేడాలను సరిదిద్ది అప్‌డేట్‌ చేశారు.

Updated Date - 2020-06-22T09:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising