ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటితుడుపు మాటలొద్దు

ABN, First Publish Date - 2020-08-14T10:55:09+05:30

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తమ త్యాగాలను గుర్తించాలని రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు/తాడికొండ, ఆగస్టు 13 : అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తమ త్యాగాలను గుర్తించాలని రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 240వ రోజుకు చేరాయి. తుళ్లూరులో రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. పెదపరిమి, వెలగపూడి, రాయపూడి, మందడం, అబ్బరాజుపాలెం గ్రామాల్లోని రైతులు దీక్షా శిబిరాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు వ్యక్తంచేస్తున్న రైతులు, మహిళలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందన్నారు.


మూడు రాజధానులపై ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని కోరారు. రాజధాని రైతులకు మద్దతుగా పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో నిరసన దీక్షలు నిర్వహించారు. దీక్షలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ.. సీనియర్‌ నేత మన్నవ సుబ్బారావుతో కలిసి గుంటూరులోని తన నివాసంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

Updated Date - 2020-08-14T10:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising