ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా నదికి వరద ఉధృతి..అధికారుల అప్రమత్తం

ABN, First Publish Date - 2020-10-14T16:27:59+05:30

ఎగువ నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అధికారులను అప్రమత్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: ఎగువ నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతిపై  జిల్లా కలెక్టర్  ఏ.యండి.ఇంతియాజ్ అధికారులను అప్రమత్తం చేశారు. నివాస ప్రాంతాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని... సహాయక చర్యల్లో అధికారులకు సహకరించి.... పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. మరోవైపు వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద  మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరికాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక జారికానుంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,09,770, అవుట్ ఫ్లో 5,06,604 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత  అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. చంద్రర్లపాడు  నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 6,46,747, అవుట్‌ ఫ్లో 5,34,933 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని.. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఆదేశించారు. 

Updated Date - 2020-10-14T16:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising