ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్తాపంతో కౌలురైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-29T06:12:06+05:30

మనస్తాపంతో కౌలురైతు ఆత్మహత్య

గద్వాల కృష్ణ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుఫాను ప్రభావంతో తీవ్ర పంటనష్టం

చల్లపల్లి : పంట నష్టపోయాననే మనస్తాపంతో కౌలురైతు గద్వాల కృష్ణ(46) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి పడమర వీధిలో ఉంటున్న గద్వాల కృష్ణ కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు. ఘంటసాల మండలం కొడాలిలో రెండెకరాలు సొంతంగా, ఏడెకరాలు ఉమ్మడిగా కౌలు చేస్తున్నాడు. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. కోతలు పూర్తయ్యి పనల మీదున్న పొలాల వివరాలు ముందుగా నమోదు చేస్తుండటంతో తాను కౌలుకు చేస్తున్న పైరుకు నష్టపరిహారం రాదనుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో  శనివారం మధ్యాహ్నం పురుగుమందు సేవించాడు.  కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, ప్రాథమిక చికిత్సలు చేసి మెరుగైన వైద్యసేవలకు మచిలీపట్నం వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పొలానికి సుమారు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. వీఆర్వో పి.జయరామ్‌ వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

Updated Date - 2020-11-29T06:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising