ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెట్‌ సిటీకి మోక్షం

ABN, First Publish Date - 2020-07-16T15:29:30+05:30

జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీని కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీని కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం స్టేట్‌ ఎకనామిక్‌ సిటీస్‌ ప్రమోషనల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎడ్కో)కు నిధులు మంజూరు చేసింది. దీంతో ఏడాదిగా ప్రతిష్టంభనలో ఉన్న జెట్‌సిటీ భవితవ్యంపై చిక్కుముడి వీడింది. స్టేట్‌ టౌన్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఆధీనంలో ఉన్న మిగులు భూములను బదలాయించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఏపీ టిడ్కో, ఏపీ ఎడ్కో, రెవెన్యూ ఉన్నతాధికారుల సమక్షంలో భూ బదలాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. 


ఇలా మొదలై.. అలా ఆగింది..

జెట్‌ సిటీ నిర్మాణం కోసం గతంలో 235 ఎకరాల ప్రభుత్వ భూములను సేకరించారు. ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెట్‌ (ఏపీయూఐఏఎంఎల్‌)కు అప్పగించారు. వాక్‌ టు వర్క్‌ విధానంలో గృహ నిర్మాణం, పరిశ్రమలు రెంటినీ ఒకచోటే  నిర్మించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ముందుగా పేదలకు, ఆ తర్వాత అన్ని వర్గాలకు చోటు కల్పించాలని నిర్ణయించారు. ముందుగా 18వేల గృహ నిర్మాణాలు నిర్మించాలని నిర్ణయించి ఆ బాధ్యతలు ఏపీ టిడ్కోకు అప్పగించారు. లైట్‌ అండ్‌ గ్రీన్‌ ఇండస్ర్టీస్‌ కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో ఇండస్ర్టియల్‌ కాంప్లెక్సులను నిర్మించాలని భావించి ఈ బాధ్యతలను ఏపీ ఎడ్కోకు అప్పగించారు. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం ఏపీయూఐఏఎంఎల్‌ నుంచి భూములను తీసుకుని మొత్తం 80 ఎకరాల్లో 10వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 6వేల ఇళ్లను తుది దశకు తీసుకొచ్చారు. ఇండస్ర్టియల్‌ కాంప్లెక్సుల విషయానికొస్తే 8.56 ఎకరాల్లో 6.45 లక్షల చదరపు అడుగుల  విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏపీ టిడ్కో ఆధీనంలో 150 ఎకరాల మిగులు భూములు ఉండటం వల్ల వాటిని కూడా బదలాయించుకుంటే తప్ప ఇండస్ర్టియల్‌ కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎడ్కోకు నిధులు కేటాయించాక భూ బదలాయింపునకు చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత బుధవారం సంబంధిత శాఖలతో సమావేశమై మిగులు భూముల బదలాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - 2020-07-16T15:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising