ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు తల్లికి తెలంగాణ బోనం

ABN, First Publish Date - 2020-07-06T09:34:42+05:30

భాగ్యనగర (హైదరాబాద్‌) మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : భాగ్యనగర (హైదరాబాద్‌) మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే కమిటీ సభ్యులు, కళాకారులు వచ్చారు. ఉదయం 11 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద దేవతామూర్తుల విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిర్వహించి.. ఊరేగింపుగా బయల్దేరి ఘాట్‌రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు.


దుర్గమ్మ దర్శనం చేసుకుని బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పదకొండేళ్లుగా కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తున్నామన్నారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌బాబు, వేదపండితులు, అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. 


ముగిసిన శాకంబరీ ఉత్సవాలు 

ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఆలయ స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి, కూష్మాండ బలి, మార్జనం కలశోద్వాసన, ఆశీర్వాద కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల వరకు అమ్మవారు శాకంబరీదేవిగానే భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రసాదంగా కదంబం పంచిపెట్టారు. 

Updated Date - 2020-07-06T09:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising