ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్య ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తా : హోం మంత్రి

ABN, First Publish Date - 2020-10-17T23:38:24+05:30

దివ్య తేజస్విని హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి గంటకో ట్విస్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : దివ్య తేజస్విని హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి గంటకో ట్విస్ట్.. కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత.. దివ్య తల్లిదండ్రులు కలిసి పరామర్శించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ సుచరితకు వినతీపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. దివ్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లుదండ్రులు కోరుకున్న విధంగా న్యాయ జరిగేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్ని చట్టాలు చేసిన నేరాలు జరగడం బాధాకరమన్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు 13 కత్తిపోట్లు పొడుచుకున్న సంఘటనలు లేవని.. నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో కత్తిపోట్లు అంశం తెరపైకి వచ్చిందనిపిస్తోందన్నారు. 


తెలిసి తెలియని వయసులో దిగిన ఫొటోలు ఇప్పుడు బయట పెట్టారన్నారు. నిందితుడిపై ఐపీసీ 302, 304, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు  చేస్తామని హోంమంత్రి తెలిపారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని.. ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి లేదా 100కు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని సుచరిత తెలిపారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారు.

Updated Date - 2020-10-17T23:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising