ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.కోటి హవాలా డబ్బు స్వాధీనం

ABN, First Publish Date - 2020-11-30T06:43:59+05:30

ఏ విధమైన లెక్కలు లేవు.. ఏకంగా కోటి రూపాయలు.. రెండు బ్యాగ్‌ల్లో సర్దేసి, బస్సులోకి ఎక్కిస్తుండగా, పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

పట్టుబడిన హవాలా డబ్బు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరి అరెస్టు


విజయవాడ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఏ విధమైన లెక్కలు లేవు.. ఏకంగా కోటి రూపాయలు.. రెండు బ్యాగ్‌ల్లో సర్దేసి, బస్సులోకి ఎక్కిస్తుండగా, పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు చెందిన ఇంద్రసింగ్‌, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉదయ్‌కుమార్‌ సెల్‌ఫోన్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉదయ్‌కుమార్‌ గుంతకల్లు నుంచి విజయవాడ వచ్చాడు. ఇంద్రసింగ్‌తో కలిసి కోటి రూపాయలు రెండు బ్యాగ్‌ల్లో సర్దుకుని, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌కు చేరుకుని, గుంతకల్లు బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉండగా, టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ వర్మ బృందం దాడిచేసి పట్టుకుంది. ఇంద్రసింగ్‌ను, ఉదయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కీలకమైన మరో వ్యక్తి గుంతకల్లులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు వ్యాపారంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు తేలింది. ఎలాంటి లెక్కాపత్రాలు లేకుండా రహస్యంగా తరలించడానికి ఇదే కారణమని గుర్తించారు. నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2020-11-30T06:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising