ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడి పని అక్కడే!

ABN, First Publish Date - 2020-11-20T06:47:20+05:30

బాపులపాడు మండలంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.

నిర్మాణంలో ఉన్న బాపులపాడు-3 సచివాలయ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం నియోజకవర్గంలో ముందుకు కదలని ప్రభుత్వ భవనాల నిర్మాణం

కేటాయింపుల కుమ్ములాటలే కారణం!

హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 19 : బాపులపాడు మండలంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల నిర్మాణం నత్తనడకన  సాగుతోంది. మండలంలో 22 గ్రామ సచివాలయ కేంద్రాలకుగాను 20 సచివాలయాలు, 22 రైతు భరోసా కేంద్రాలు, 18 వెల్‌నెస్‌ సెంటర్లకు కొత్త భవనాలను ప్రభుత్వం మే నెలలో మంజూరు  చేసింది. అయితే ఇప్పటి వరకు ఏడు సచివాలయ భవనాలు, మూడు రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మంజూరైన 18 వెల్‌నెస్‌ సెంటర్లలో ఒక్క సెంటర్‌కు కూడా భూమి పూజ జరగలేదు. ఒక్కొక్క సచివాలయానికి రూ.40 లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.21.8 లక్షలు, వెల్‌నెస్‌ సెంటర్‌కు రూ14.95 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనుల ప్రారంభానికి కొంత కాలం ఇసుక కొరత సాకుగా చూపించారు. తరువాత గన్నవరంఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వైసీపీలో చేరడం.. మారిన రాజకీయ పరిణామాలతో మరి కొంత జాప్యం చోటు చేసుకుంది. 


వంశీమోహన్‌, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య పనుల కేటాయిపు విషయంలో విభేదాలు తలెత్తడమే జాప్యానికి కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మండలంలో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వర్గాల మధ్య వాటాల వివాదం కూడా బహిర్గతమయింది. ఇటీవల కాకులపాడు గ్రామ సచివాలయ భవన శంకుస్థాపన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. తొలుత  దుట్టా వర్గీయులకు కేటాయించిన పనులను, వంశీ తన అనుచరులకు కేటాయించారంటూ దుట్టా వర్గీయులు ఆందోళనకు దిగారు. అయితే పనుల కేటాయింపులో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వైసీపీ నాయకులకే వంశీమోహన్‌ ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన వర్గీయులంటున్నారు. కాగా నియోజకవర్గంలో నిర్మాణ పనులు నత్త్తనడకన సాగుతున్నాయని జిల్లా ఉన్నతాధికారులు మండలస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మండల అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి తయారయింది. మంజూరైన భవనాల పనులను ముమ్మరం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-11-20T06:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising