ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం యాప్‌తో రైతుకు మేలు

ABN, First Publish Date - 2020-08-09T09:58:18+05:30

రైతులు వ్యవసాయ అవసరాలు పర్యవేక్షించేందుకు, పంటలకు మద్దతు ధర కల్పించేందుకే సీఎం యాప్‌ను ప్రభుత్వం రూపొందించిందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : రైతులు వ్యవసాయ అవసరాలు పర్యవేక్షించేందుకు, పంటలకు మద్దతు ధర కల్పించేందుకే సీఎం యాప్‌ను ప్రభుత్వం రూపొందించిందని జేసీ కె. మాధవీలత అన్నారు. సీఎం యాప్‌ మొబైల్‌ అప్లికేషన్‌ వినియోగంపై మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీకేష్‌ జూమ్‌ యాప్‌ద్వారా శనివారం అవగాహన కల్పించారు.


విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జేసీ పాల్గొన్నారు. రైతులు పంట వేసిన నాటినుంచి దిగుబడులు విక్రయించే వరకు రైతు భరోసా కేంద్రాల్లో విలేజ్‌ అసిస్టెంట్లు వివరాలు నమోదు చేస్తారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధర ఉంటే  ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఈ యాప్‌ను ఉపయోగిస్తారన్నారు. ఈ యాప్‌ వినియోగంపై ఈ నెల 10, 11, 12 తేదీల్లో క్షేత్ర స్థాయిలో శిక్షణ ఉంటుందన్నారు.  మార్క్‌ఫెడ్‌ డీఎం సీహెచ్‌ శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ శాఖ డీడీ దివాకర్‌, వ్యవసాయశాఖ జేడీ టి.మోహనరావు, ఏవో పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T09:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising