ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళి కట్టాల్సిందే

ABN, First Publish Date - 2020-03-08T12:02:20+05:30

ప్రేమ పేరుతో వంచించి హత్యచేశారు.. ఆమె చివరి కోరిక తీర్చరా.. చనిపోయినా సరే మృతదేహానికి తాళి కట్టాల్సిందేనంటూ ఖనానికి తీసుకువెళ్లిన బాలిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బాలిక మృతదేహంతో బంధువుల ఆందోళన
  • అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడి 
  • ముసునూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత


నూజివీడు: ప్రేమ పేరుతో వంచించి హత్యచేశారు.. ఆమె చివరి కోరిక తీర్చరా.. చనిపోయినా సరే మృతదేహానికి తాళి కట్టాల్సిందేనంటూ ఖనానికి తీసుకువెళ్లిన బాలిక మృతదేహాన్ని గోతినుంచి ప్రియుడి ఇంటికి తీసుకువెళ్లేందుకు మృతురాలి బంధువులు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులపై కారంతో దాడికిదిగి పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో కృష్ణాజిల్లా ముసునూరు మండలం గుళ్లపూడి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో గాయపడిన ముసునూరు ఎస్సైని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ప.గో జిల్లా పెదవేగి మండలం, ఒంగూరులక్ష్మిపురం గ్రామానికి చెందిన యువతి, ముసునూరు మండలం గుళ్లపూడి గ్రామానికి చెందిన యువకుడు ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో, రెండు కుటుంబాల మద్య పంచాయితీ జరిగింది. శ్రావణికి మైనార్టీ తీరిన తర్వాత వివాహం జరపడానికి పంచాయితీలో తీర్మానించారు. 


అయితే యువతికి తల్లి లేకపోవడంతో తాను తండ్రి వద్ద కాకుండా కాబోయే అత్త, మామల ఇంటివద్దే ఉంటానని కోరడంతో పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది నుంచి ఆమె అత్త, మామల గృహంలో ఉంటోంది. మరో 15 రోజుల్లో ఆమె మైనార్టీ తీరనున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో ఏం జరిగిందో తెలియదు కానీ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈనెల 4వ తేదీన మృతి చెందింది. ఆమె ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతున్న విషయం తమకు సమాచారం తెలుపలేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు నెలలుగా తన కుమార్తెను కాబోయే అత్తింటివారు, వరకట్న వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని యువతి కుటుంబసభ్యులు శుక్రవారం నూజివీడు, ముసునూరు పోలీస్‌ స్టేషన్‌ల వద్ద ఆందోళన నిర్వహించారు. 


దిశ చట్టం కింద కేసు నమోదుచేసి యువతి మృతికి కారకులైన వారిని ఉరి తీయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. శనివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష అనంతరం యువతి మృతదేహాన్ని కాబోయే అత్త, మామలకు అప్పగించడంతో శనివారం సాయంత్రం గుళ్లపూడి గ్రామంలో ఆమె మృతదేహాన్ని ఖననం చెయ్యడానికి కాబోయే అత్త, మామలు ప్రయత్నించగా యువతి కుటుంబసభ్యులు, గుళ్లపూడి గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో బాలిక హత్యోదంతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసగించిన యువకుడిని, అతడి తల్లిదండ్రులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పోలీసుల అదుపులో ఉన్న యువకుడిని తీసుకువచ్చి యువతి మృతదేహానికి తాళి కట్టాల్సిందేనంటూ మృతురాలి బంధువులు గ్రామస్థులు మృతదేహాన్ని ఖననం చేసే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అప్పటికే ఖననం చెయ్యడానికి గోతిలో ఉంచిన యువతి మృతదేహాన్ని గోతి నుంచి తీసుకుని గ్రామంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు ఏకంగా పోలీసులపై కారం, కర్రలతో దాడిచేసి ముసునూరు, నూజివీడు రూరల్‌ పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యువకుడు తాళి కట్టాల్సిందేనంటూ ఉద్రిక్తతల నడుమ యువతి మృతదేహాన్ని అతడి ఇంటికి చేర్చారు. చివరకు అర్ధరాత్రి 11.30 గంటలకు వాదన ముగిసింది.  పెద్ద మనుషులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని ఖననం చేయడానికి మృతుని బంధువులు ఒప్పుకున్నారు.

Updated Date - 2020-03-08T12:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising