ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర గాయకుడు ఘంటసాల : మంత్రి అవంతి

ABN, First Publish Date - 2020-12-05T06:08:48+05:30

అమర గాయకుడు ఘంటసాల : మంత్రి అవంతి

ఘంటసాల విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ కల్చరల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మర ణీయుడిగా ఉంటారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు అన్నారు. ఘంటసాల జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నాడు ఘంటసాల ఆలపించిన గేయాలు నేటి కళాకారులకు ఉపాధిని చూపుతున్నాయన్నారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్‌ వంగపండు ఉష, సాంస్కృతిక శాఖ సీఈవో మల్లికార్జునరావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ గోవిందరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల భారీ చిత్రాన్ని కలెక్టర్‌కు మల్లికార్జునరావు అందజేశారు. అనంతరం గాయనీ గాయకులు ఘంటసాల గీతాలను ఆలపించారు. సాయంత్రం నిర్వహించిన ఘంటసాల సంగీత విభావరిలో అధికార భాషా సంఘం చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పాల్గొన్నారు. కళాకారులను డైరెక్టర్‌ మల్లికార్జునరావు ఘనంగా సత్కరించారు.

Updated Date - 2020-12-05T06:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising