ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడైన పంటను ఏంచేసుకోవాలి?

ABN, First Publish Date - 2020-12-05T05:55:10+05:30

నివర్‌ తుఫాను పంటను నేలపాలు చేయగా, డ్రైనేజీ వ్యవస్థ రైతులను నిండా ముంచింది. నేటికీ పంట చేలల్లో నీళ్లు తగ్గక పోవటంతో దిగాలు చెందిన రైతులు తమ పంటను తొక్కించేస్తున్నారు.

పూషడం గ్రామంలో పంటను ట్రాక్టర్‌తో తొక్కిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘంటసాల, డిసెంబరు 4 : నివర్‌ తుఫాను పంటను నేలపాలు చేయగా, డ్రైనేజీ వ్యవస్థ రైతులను నిండా ముంచింది. నేటికీ పంట చేలల్లో నీళ్లు తగ్గక పోవటంతో దిగాలు చెందిన రైతులు తమ పంటను తొక్కించేస్తున్నారు. పూషడం గ్రామానికి చెందిన కూనసాని ఫిరోజ్‌ నాయుడు రెండె కరాలు, కౌలు రైతు చీడేపూడి వాలి నాలుగెకరాలు సాగు చేస్తున్నారు. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు పంట నేల కొరగటంతోపాటు చేలల్లో నీళ్లు రెండడుగుల మేర నిలిచిపోయాయి. తుఫాను ప్రభావం తగ్గి 10 రోజులవుతున్నా నేటికీ నీళ్లు తగ్గకపోవటంతో పంట మొలకలు వచ్చి పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే రూ.25 వేల నుంచి 30 వేల వరకు సాగు ఖర్చులవ్వటంతోపాటు కూలీ రేట్లు కూడా భారంగా ఉన్నాయి. ఇక భరించలేమని భావించిన రైతులు తమ పంటను తొక్కించి దమ్ము చేసుకుని రెండో పంటకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే గ్రామంలో కౌలు రైతు వెంకటేశ్వరరావు సైతం తన ఎనిమిదెకరాల పంట మొలకలు వచ్చి పూర్తిగా దెబ్బతినటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పూషడం గ్రామ పరిధిలో సుమారు 1500 ఎకరాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. 

పెదకళ్లేపల్లిలో పంటల్ని దున్నేస్తున్న రైతులు

మోపిదేవి : మండలంలోని పెదకళ్లేపల్లి గ్రామంలో చెరువులోపల ఆయకట్టు పరిధిలోని 15 ఎకరాల వరి పంటను శుక్రవారం ట్రాక్టర్లతో దమ్ము చేశారు. వర్షాల కారణంగా నేలవాలిపోయి కంకులు, మొల కలు వచ్చేశాయి. ఎకరాకు రూ.12 వేలు కోత కూలీ వెచ్చించలేక దిక్కుతోచని స్థితిలో దమ్ము చేస్తున్నామని రైతులు బండే వెంకట రమణ, చీర్ల రమేష్‌, రాజనాల ప్రసాద్‌ చెప్పారు. గ్రామంలోని ఆయ కట్టు పరిధిలో 150 ఎకరాలకుపైగా పంటలు తొక్కించేయాల్సి ఉం దని తెలిపారు. కనీసం పంట కోసేందుకు కూడా అవకాశం లేనం తగా పాచిపోయిందని, ప్రస్తుతం ఉన్న పంటను తొక్కించేస్తే రెండో పంట మినుము అయినా సకాలంలో మొలిచే అవకాశం ఉంటుందం టున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సైతం తమను పట్టించుకునే సమయం ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులను ఆదుకోకుంటే పోరాటానికి సిద్ధం :  మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్‌

మోపిదేవి, డిసెంబరు 4 : వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టాల బారిన పడిన రైతులను ప్రభుత్వం ఆదుకోని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధమని మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం మండలంలోని మెరకనపల్లి, టేకుపల్లి, వెంకటాపురం, పెదకళ్లేపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెన కారణంగా ప్రాణనష్టం మాత్రమే జరిగిందని, ప్రస్తుత నివర్‌ తుఫాను దేశానికే అన్నపూర్ణగా ఉన్న కృష్ణాడెల్టాలోని రైతుల వెన్ను విరిగిచిందన్నారు. కేవలం భవనాలు నిర్మించి కేంద్రాలు ఏర్పాటు చేయటం కాదని, రైతులకు అన్నివిధాలుగా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతులు పడుతున్న కష్టాలు తెలుస్తాయన్నారు. తక్షణమే రైతులకు పూర్తి రాయితీపై విత్తనాలు అందించి రైతులు నష్టపోయిన మొత్తం పరిహారం రూపంలో అందజేయాలన్నారు. పెదకళ్లేపల్లిలో వరిపంటను తొక్కిస్తున్న రైతులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నడకుదుటి జనార్థనరావు, పార్టీ నేతలు అరజా నరసింహారావు, గొర్రెపాటి నాగేశ్వరరావు, అరజా సాంబశివరావు, రావి రత్నగిరి, కూరేటి నాంచారయ్య ఆయన వెంట ఉన్నారు. 

అన్నదాతలను ఆదుకోవాలి

నాగాయలంక : అన్నదాతలను ఆదుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం మండలంలోని నంగేగడ్డ, చోడవరం గ్రామాల్లో తుఫానుకు దెబ్బతిన్న వరిపంటలను మండలి పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలు వేయాలని కోరారు. టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ బావిరెడ్డి వెంకటేశ్వరరావుతోపాటు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

దళారులకు ధాన్యం విక్రయించొద్దు : జేసీ 

విజయవాడ సిటీ : మధ్య దళారుల ద్వారా ధాన్యం విక్రయిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి నగదు లభించదని జేసీ కె.మాధవీలత స్పష్టం చేశారు. ధా న్యం కొనుగోలుకు సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పది రోజుల పాటు నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ జేసీలో భాగంగా శుక్రవారం 16 మంది రైతులు ఫోన్‌ చేయగా అందులో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆరు గురు రైతులు తమ సమస్యలు తెలిపారు. ఉయ్యూరు, ముదినే పల్లి మండలం పెదకామనపూడి, మొవ్వ మండలం, జగ్గయ్యపేట, తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామం, నందిగామ మండలం మాగల్లు తదితర ప్రాంతాల నుంచి రైతుల నుంచి ఫోన్‌కాల్స్‌ ద్వారా రైతుల సందేహాలను జేసీ నివృత్తి చేశారు.


Updated Date - 2020-12-05T05:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising