ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు

ABN, First Publish Date - 2020-06-05T09:17:33+05:30

రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రుల కమిటీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రుల కమిటీ నిర్ణయం 


అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధిపై గురువారం విజయ వాడలో మంత్రులు రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారా యణ, కన్నబాబు, సీఎం సలహాదారు అజయ్‌కల్లాం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌శాఖల కమిషనర్లు అరుణ్‌ కుమార్‌, చిరంజీవ్‌ చౌదరి, ప్రద్యుమ్న పాల్గొన్నారు. 


సీమలో ముందస్తు సాగు : కన్నబాబు

తక్కువ పెట్టుబడితో, అధిక దిగుబడి సాధించేందుకు, వ్యవసాయం లాభసాటిగా ఉండేలా అన్ని ఉత్తమ సాగు పద్ధతులను రైతుల చెంతకు చేర్చుతామని వ్యవసాయ మంత్రి కన్నబాబు చెప్పారు. రైతుసాధికార సంస్థ ఆధ్వ ర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రుతుపవనాలకు ముందు మెట్ట సాగు విధానంపై గురువారం జెడ్‌బీఎన్‌ ఎఫ్‌ అధికారులు, రాయలసీమ జిల్లాల రైతుభరోసా జేసీ లు, జేడీఏలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జెడ్‌బీఎన్‌ఎఫ్‌ సలహాదారు విజయకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T09:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising