ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఈవో వేధింపులపై విచారణ

ABN, First Publish Date - 2020-12-06T06:25:12+05:30

ఎంఈవో వేధింపులపై విచారణ

ముదినేపల్లిలో విచారణ నిర్వహిస్తున్న విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుల్తానా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదినేపల్లి, డిసెంబరు 5: మండల విద్యాధికారి బి.శ్రీనివాసుపై వచ్చిన వేధింపుల ఆరోపణల్లోని నిజానిజాల నిర్ధారణకు నాలుగోసారి శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. గురజ-2 పాఠశాల హెచ్‌ఎం రజిత, పెదపాలపర్రు కాంప్లెక్స్‌ సీఆర్పీ విజయదుర్గ ఇచ్చిన వేధింపుల ఫిర్యాదులు, వారికి మద్దతుగా ఏపీటీఎఫ్‌, ఎస్టీయూ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను మండల రిసోర్స్‌ సెంటరులో ఏపీ మోడల్‌ స్కూల్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుల్తానాబేగం, మరో అధికారి అన్నపూర్ణ విచారించారు. మండల విద్యాధికారిపై ఫిర్యాదులు వాస్తవమేనని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్రప్రసాద్‌, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్‌ ప్రసాదరావు, మండలశాఖ అధ్యక్షుడు పి.రాము తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని డీడీ సుల్తానా తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎంఈవో శ్రీనివాసు అన్నారు.

గందరగోళం

ఎంఈవోపై విచారణ అంతా గందరగోళంగా జరిగింది. విచారణలో ఫిర్యాదుదార్లు, అందుకు సంబంధించిన వారే పాల్గొనాలని డీఈవో రాజ్యలక్ష్మి సమాచారం పంపినప్పటికీ, కొంతమంది ఉపాధ్యాయులు ఫిర్యాదులతో సంబంధం లేకపోయినా విచారణలో పాల్గొన్నారు. ఎంఈవోకు అనుకూలంగా వ్యవహరించారు. 


Updated Date - 2020-12-06T06:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising