ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రహసనంగా నిత్యావసరాల పంపిణీ

ABN, First Publish Date - 2020-06-06T08:43:45+05:30

పట్టణంలో పెద్ద రామాలయం వద్ద ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిత్యా వసరాల పంపిణీ ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి వరకు కొనసాగిన హైడ్రామా 

పోలీస్‌ జోక్యంతో పాక్షిక పంపిణీ


జగ్గయ్యపేట, జూన్‌ 5: పట్టణంలో పెద్ద రామాలయం వద్ద ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిత్యా వసరాల పంపిణీ ఒక ప్రహసనంగా మారింది. జగ్గయ్యపేట క్వారంటైన్‌ సెంటర్లలో మిగిలిన నిత్యావసరాలను ఐసీడీఎస్‌ ద్వారా లబ్ధిపొందే వారికి మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించగా పట్టణంలో పెద్ద రామాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. అది తెలుసుకున్న అనేకమంది పేద మహిళలు తమకు కూడా నిత్యావసరాలు అందజేయాలని ఉదయం 11 గంటల నుంచి రామాలయం ముందు బైఠా యించారు.


దీంతో అంగన్‌వాడీలు ఎంపిక చేసిన వారు కూడా రాత్రి 7గంటల వరకు వేచి ఉన్నారు. ఆఖరుకు పోలీ సులు జోక్యంతో పాక్షికంగా పంపిణీ చేసి చీకటి పడటంతో సరుకులను సమీపంలో అంగన్‌వాడీ కేంద్రానికి తరలిం చారు. ఐసీడీస్‌ అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ గందర గోళానికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఏ సెంటర్‌ లోని వారికి ఆ సెంటర్‌ ద్వారా పంపిణీ చేస్తే ఈ ఇబ్బందు లేమీ ఉండేవి కాదని, పైగా కరోనా భయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు లేకుండా సామూహిక పంపిణీకి సిద్ధపడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-06-06T08:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising