కరోనాపై పోరుకు ప్రజాప్రతినిధుల వితరణ
ABN, First Publish Date - 2020-03-27T08:56:00+05:30
కరోనాపై పోరాటానికి ప్రజాప్రతినిధులు తమ వంతు నిధులు అందించేందుకు ముందుకొస్తున్నారు. నిధుల వితరణలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ముందుగా స్పందించారు.
ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపు
ఎంపీ కేశినేని నాని అత్యధికంగా రూ.5 కోట్లు
ఎంపీలు బాలశౌరి రూ.4 కోట్లు, కనకమేడల రూ.కోటి
టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం వితరణ
పోలీసులకు వెలగపూడి శంకర్‌బాబు రూ.లక్ష విరాళం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కరోనాపై పోరాటానికి ప్రజాప్రతినిధులు తమ వంతు నిధులు అందించేందుకు ముందుకొస్తున్నారు. నిధుల వితరణలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ముందుగా స్పందించారు. ఈ నెల 23న ఆయన జిల్లా కలెక్టర్‌కు ఓ లేఖ రాస్తూ తన ఎంపీ నిధుల నుంచి రూ.5 కోట్లను కరోనా నియంత్రణకు అవసరమైన నిధులకు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆ లేఖలో కోరారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సైతం తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.4 కోట్లను కరోనా బాధితుల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. తనతో పాటు రాష్ట్రంలోని ఎంపీలందరూ తమ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.4 కోట్లను సీఎం రిలీఫ్ పండ్‌కు కరోనా బాధితులను ఆదుకునేందుకు కేటాయించా లని బాలశౌరి ఆ లేఖలో అభ్యర్థించారు. జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ సైతం తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటిని కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ అదే బాట
జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కరోనా నియంత్రణకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తమ నెల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు కేటా యించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఒక నెల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు కేటాయించారు.
పోలీసులకు రూ.లక్ష సాయం
టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వెలగపూడి శంకరబాబు రూ.లక్ష విరాళంగా అందజేశారు. కరోనాను నియంత్రించే విషయంలో పోలీసులు అందిస్తున్న సేవలు కొనియాడదగినవని ఆయన ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. రోడ్లపై విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు శానిటై జర్లు, మాస్కులు అందించేందుకు తాను అందించిన రూ.లక్ష వినియో గించాల్సిందిగా ఆయన సీపీ ద్వారకా తిరు మలరావును అభ్యర్థించారు. శంకరబాబు తరఫున రూ.లక్ష చెక్కును ఆయన కుటుంబ సభ్యులు సీపీకి అందించారు.
Updated Date - 2020-03-27T08:56:00+05:30 IST