ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-28T06:05:34+05:30

ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు.

శ్రీకాకుళంలో కాగడాల ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు, కాగడాల ప్రదర్శన

ఘంటసాల, డిసెంబరు 27 : ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. కాగడాలు చేపట్టిన రైతు సంఘ ప్రతినిధులు కరకట్ట మీద నుంచి గ్రామపురవీధుల్లో తిరుగుతూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ ప్రతినిధులు గుత్తికొండ రామారావు, అట్లూరి వెంకటేశ్వరరావు, సీపీఎం ప్రతినిధులు శీలం నారాయణరావు, టీడీపీకి చెందిన అత్తలూరి గోపిచంద్‌, తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్న), ముమ్మనేని రవిప్రసాద్‌, డేవిడ్‌ పాల్గొన్నారు. 


కూచిపూడి  : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా మొవ్వలో చేపట్టిన రిలే  దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. చేబ్రోలు భాస్కరరావు, తాతినేని పూర్ణచంద్రరావు, శ్రీనివాసరావు, రావూరి రమేష్‌, వడ్డి వెంకటేశ్వరరావు, కూరపాటి కృష్ణమూర్తి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.


 తోట్లవల్లూరు  : కేంద్రప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తోట్లవల్లూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివారం ప్రజాసంఘాల నాయకులు రిలే దీక్ష చేపట్టారు.  కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, మండల వ్వవసాయ కార్మిక సంఘం కార్యదర్శి శీలం ప్రకాశరావు, మండల కౌలు రైతు సంఘం నాయకులు జె.ఏసేబు, శ్రీను, ధర్మారావు, ఇసుక ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు ఒండ్రు నాగేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి బాజీబాబు, మాజీ ఎంపీపీ వీరంకి వెంకట గురుమూర్తి, మండల తెలుగురైతు అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ, వల్లూరు సుదర్శనరావు పాల్గొన్నారు.








Updated Date - 2020-12-28T06:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising