ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ కింద 2434 వ్యాధులకు వైద్యం

ABN, First Publish Date - 2020-11-11T10:10:36+05:30

ఆరోగ్యశ్రీ కింద 2434 వ్యాధులకు వైద్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడి


విద్యాధరపురం, నవంబరు 10 : ఆరోగ్యశ్రీ పథకం కింద 2434 వ్యాధులకు సంబంధించి నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సహాయం అందిస్తోందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో ఆరోగ్యశ్రీ అమలుపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షిస్తూ అదనంగా 234 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఎనికేపాడులోని అను న్యూరో అండ్‌ కార్డియాక్‌ సెంటర్‌ నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌,  జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని హాజరై జిల్లాలో ఆరోగ్యశ్రీ అమలు ద్వారా లబ్ధిపొందిన కుటుంబాల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. తొలుత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం.. కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎం.సుహాసిని, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ బాలసుబ్రహ్మణ్యం, ఆరోగ్యశ్రీ పధకం లబ్దిదారులు ఆర్‌.శంకర్‌రావు, ఎల్‌.మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-11T10:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising