ప్రాజెక్టులు కట్టడం చేతకాక పేర్లు మారుస్తారా?
ABN, First Publish Date - 2020-12-11T06:09:58+05:30
ప్రాజెక్టులు కట్టడం చేతకాక పేర్లు మారుస్తారా?
మాజీ మంత్రి దేవినేని ఉమా
రెడ్డిగూడెం, డిసెంబరు 10: ప్రాజెక్టులు కట్టడం చేతకాక టీడీపీ హయాంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టుల పేర్లు మారుస్తారా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నాయకులను ప్రశ్నించారు. పసుపు చైతన్యంలో భాగంగా తాడిగూడెంలో గురువారం ఆయన పర్యటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. పరిటాల రవీంద్ర లిఫ్ట్‌కు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు పెట్టుకోవడం శోచనీయమన్నారు.
అధికారంలోకి వస్తే ‘పరిటాల’ పేరే పెడతాం
టీడీపీ అధికారంలోకి రాగానే జీడిపల్లి పేరూరు ఎత్తిపోతల పథకానికి మరలా పరిటాల రవీంద్ర పేరు పెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా 8.43 లక్షల రేషన్ కార్డులు తొలగిస్తారా? సాంకేతిక కారణాల సాకుతో 25 లక్షల మందికి రేషన్ నిలిపివేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కె.విజయబాబు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, ఉయ్యూరు అంజిరెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్‌రెడ్డి, కామిశెట్టి వెంకట నరసయ్య, కుప్పిరెడ్డి అశోక్ రెడ్డి, చేబ్రోలు రాజు, కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, జానలపాటి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T06:09:58+05:30 IST