ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈడీ పరీక్షలు వాయిదా.. ‘ప్రైవేటు’ ఒత్తిడే కారణమా?

ABN, First Publish Date - 2020-09-27T15:13:29+05:30

డీఈడీ పరీక్షలు వాయిదా వేయ డంతో ఈ కోర్సు చదువుతున్న విద్యార్థుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: డీఈడీ పరీక్షలు వాయిదా వేయ డంతో ఈ కోర్సు చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 2018- 20 బ్యాచ్‌కు చెందిన వారికి  మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదని, ఆగస్ట్టులో నిర్వహిస్తామని ప్రకటించి  వాయిదా వేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కళాశాలలు ఎంట్రన్స్‌ పరీక్ష రాయని వారిని యాజమాన్య కోటాలో చేర్చుకున్నారని అయితే ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం ఎంట్రన్స్‌  రాసిన వారికే పరీక్ష లు నిర్వహిస్తా మని చెప్పి వారికే పరీక్షలు రాసేందుకు అనుమతులిచ్చి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో వదిలారన్నారు.


28 నుంచి అక్టోబరు 5వరకు షెడ్యూలును ప్రకటిస్తూ ఈనెల 23న ఆర్‌సీ నెంబరు18/సి1-2/2020 జారీ చేశారన్నా రు. ఎంట్రన్స్‌ రాయకుండా కోర్సు చదువుతున్న వారితో పరీక్షలు రాయిం చేందుకు కుట్రచేసి డీఈడీ పరీక్షలను వాయిదా వేశారని, ఇది ఎంత వరకు  సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నీట్‌తో పాటు అన్ని పరీక్షలూ జరుగుతున్నాయని, కేవలం డీఈడీ పరీక్షలకే కొవిడ్‌ నిబం ధనలు అడ్డురావడం ఏమిటనే వాదనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరీక్షలు రాయకుంటే రానున్న డీఎస్సీలో పాల్గొనేందుకు అర్హత కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఈడీ పరీక్షలు   జరపాలని విద్యార్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-27T15:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising