క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రాజీకి వైసీపీ నేత యత్నం
ABN, First Publish Date - 2020-12-30T01:26:42+05:30
కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు అయింది. ఐదుగురు వైసీపీ నాయకుల సహా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు
విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు అయింది. ఐదుగురు వైసీపీ నాయకుల సహా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో దాడి చేసింది. 11 మంది నుంచి రూ.63 వేలు నగదు, మూడు వాహనాలు సీజ్ చేశారు. బెట్టింగ్ కోసం వినియోగిస్తున్న బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ చేశారు. పట్టుబడ్డ బెట్టింగ్ రాయుళ్లలో ముగ్గురు బుకీలు, ఇద్దరు ఆపరేటర్లు, ఆరుగురు పందెంరాయుళ్లు ఉన్నారు. అరెస్టు చేసిన వారిలో రామవరప్పాడు సర్పంచ్ పదవికి వైసీపీ నుంచి పోటీ చేయనున్న మహిళా అభ్యర్థిని భర్త తుపాకుల స్వామితో పాటు రామవరప్పాడు, ప్రసాదంపాడుకు చెందిన వైసీపీ నాయకులు ఉన్నారు. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులతో రామవరప్పాడు వైసీపీ కీలక నేత రాజీకి విఫలయత్నం చేశారు.
Updated Date - 2020-12-30T01:26:42+05:30 IST