ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2020-10-07T15:02:50+05:30

డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటూ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటూ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వ్యవసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యం ఎంతో ఉపయోగకరమన్నారు. 2018-19లో  5 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చడం ద్వారా ఏపీ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. పీఎంకేఎస్‌వై నిధులు రూ.412 కోట్లు, నాబార్డు నిధులు రూ.616 కోట్లు కలిపి మొత్తంగా రూ.1028 కోట్లు అందుబాటులో ఉన్నా ఆయా నిధులను వినియోగించలేదని విమర్శించారు. ఈ ఏడు మార్చిలో ప్రాజెక్టు మంజూరైన రైతులకు ఇప్పటికీ పరికరాలు ఇవ్వలేదన్నారు. సూక్ష్మ సేద్యం కోసం అనంతపురం జిల్లా రైతులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇకనైనా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నామని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-07T15:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising