ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా?: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-10-01T15:17:54+05:30

కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలో సీఎం జగన్‌ దేశానికే ఆదర్శం అని చెప్పటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి కరోనా వైద్యం అందించారని ప్రశ్నించారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు రూ.2 వేల సాయం ఎంతమందికి ఇచ్చారని.. చనిపోయిన కరోనా రోగుల అంత్యక్రియల నిమిత్తం రూ.15 వేలు ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. రాష్ట్రంలో కరోనా వైద్యానికి అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లారని రామకృష్ణ ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-01T15:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising