ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధప్రాతిపదికన వైద్యకళాశాల నిర్మాణం

ABN, First Publish Date - 2020-11-11T10:06:32+05:30

మచిలీపట్నంలో వైద్యకళాశాల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదిక మీద పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి పేర్ని నాని


మచిలీపట్నం టౌన్‌, నవంబరు 10 : మచిలీపట్నంలో వైద్యకళాశాల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదిక మీద పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పేర్ని నాని తన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో కళాశాల నిర్మాణానికి చెందిన పథకాలపై పరిశీలించారు. 35 ఎకరాల్లో నిర్మించబోయే వైద్యకళాశాల, ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. రూ.550 కోట్లతో వైద్యకళాశాల నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం మంజూరు చేసిందన్నారు. మెడికల్‌ కళాశాల సమీపంలో ఉన్న రాడార్‌ స్టేషన్‌ను అధికారులు 12 మీటర్లకు మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని అంటున్నారని కార్పొరేషన్‌ ఎస్‌ఈ అశోక్‌కుమార్‌ మంత్రికి తెలిపారు.  రాడార్‌ కేంద్రం అధికారులతో చర్చలు జరపాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రవీణ్‌రాజు, డీఈ నిర్మలకుమార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌.బాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-11T10:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising