ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారంలో పంచాయతీ అభివృద్ధి

ABN, First Publish Date - 2020-10-23T10:01:28+05:30

వారంలోగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2021-22 సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రణాళిక సిద్ధం చేయండి 

అధికారులకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశం


విజయవాడ సిటీ : వారంలోగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2021-22 సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. విజయవాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్లలోని ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, గ్రామ పంచాయతీ నిర్వహణాధికారులకు గ్రామాభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంలో శిక్షణా కార్యక్రమాన్ని నగరంలోని పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో కలెక్టర్‌ గరువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పీపుల్స్‌ ప్లానింగ్‌ క్యాంపెయిన్‌ ద్వారా గ్రామాన్ని సర్వే చేసి అభివృద్ధి ప్రణాళికల్లో పొందుపరచాలన్నారు. గ్రామ పంచాయతీ వార్షిక లెక్కలు, బడ్జెట్‌ ఆయా గ్రామాల్లో గతంలో జరిగిన అభివృద్ధి, చేయాల్సిన అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా పరిషత్‌ సీఈవో సూర్యప్రకాష్‌, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T10:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising