ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జన్‌ధన్‌ ఖాతాల్లో తొలివిడత నగదు జమ

ABN, First Publish Date - 2020-04-04T09:08:53+05:30

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణయోజన పథకం కింద మహిళల పేరుతో రూ.500లు జన్‌ధన్‌ ఖాతాల్లో తొలి విడతగా కృష్ణాజిల్లాకు జమ అయ్యాయని కలెక్టర్‌ ఇంతియాజ్‌ దృష్టికి బ్యాంకర్లు తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి అంకెల ప్రకారం విత్‌ డ్రాలు 

కలెక్టర్‌ అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణయోజన పథకం కింద మహిళల పేరుతో రూ.500లు జన్‌ధన్‌ ఖాతాల్లో తొలి విడతగా కృష్ణాజిల్లాకు జమ అయ్యాయని కలెక్టర్‌ ఇంతియాజ్‌ దృష్టికి బ్యాంకర్లు తీసుకువచ్చారు. నేటి నుంచి ఈ మొత్తాన్ని మహిళలు బ్యాంకు ద్వారా డ్రా చేసుకోవచ్చు. కాబట్టి అత్యవసర సేవ ల కింద సిబ్బంది సకాలంలో బ్యాంకులకు చేరుకు నేలా అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధ్యక్షతన బ్యాంకర్ల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ పీరి యడ్‌లో నెలకొన్న ఇబ్బందుల గురించి బ్యాంకర్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్కెలిటన్‌ సిబ్బం దితో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు.


జగ్గ య్యపేట, నూజివీడు, ముప్పాళ్ల రెడ్‌జోన్‌లో ఉన్నందున అక్కడి సిబ్బందిని కనీసం బ్యాంకు పనులైనా చేసుకునేందుకు అనుమతించాలని కో రారు. కలెక్టర్‌ స్పందించి సీపీ ద్వారకా తిరుమల రావు, ఎస్పీ రవీంద్రనాద్‌బాబుతో మాట్లాడి పరి ష్కరిస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు అధికారు లు పోలీసులను సంప్రదించేందుకు ఒక నెంబర్‌ ఇస్తామని ఏ సమస్య ఎదురైనా ఆ నెంబర్‌కు కాల్‌ చేయొచ్చని సూచించారు. బ్యాంకుల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నం దున సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా పోలీసు సహా యాన్ని ఇవ్వాలని బ్యాంకర్లు కోరారు. పొదుపు సంఘాల సభ్యులకు సంబంధించి జన్‌ధన్‌ ఖాతాలలో డబ్బులు పడిఉంటే వారు బ్యాంకు లకు రావద్దని కోరారు. స్థానికంగా డ్రా చేసుకోవ టానికి అవకాశం ఉన్నందున రష్‌ తగ్గించటానికి డీఆర్‌డీఏ ఈ మేరకు సూచన చేసింది. ఏటీఎం లో డబ్బులు జమ చేయటానికి మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. 


Updated Date - 2020-04-04T09:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising