ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంటినీలో కలెక్టర్‌ తనిఖీలు

ABN, First Publish Date - 2020-11-25T06:47:02+05:30

పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఆశించిన స్థాయిలో అందించాలని సెంటినీ ఆసుపత్రి యాజమాన్యానికి కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఆశించిన స్థాయిలో అందించాలని సెంటినీ ఆసుపత్రి యాజమాన్యానికి కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచిం చారు. ఇటీవల జిల్లాలో ఎక్కువగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులను తమ ఆసుపత్రులకు తీసుకువస్తే కమీషన్‌ ఇస్తామంటూ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు బంపర్‌ ఆఫర్లు ఇస్తుండటంతో 108లో పనిచేసే సిబ్బంది రోగులను నేరుగా ఆయా ఆసుపత్రులకే తీసుకువెళ్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వ్యవహారాలతో ఆరోగ్యశ్రీ పథకం పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం లోనే కలెక్టరు ఇంతియాజ్‌ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మంగళవారం నగరంలోని సెంటినీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై వైద్యులను ప్రశ్నించారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డుకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న వైద్యసేవ లపై ఆరా తీశారు. ఆరోగ్యమిత్ర కౌంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 50 ప్రైవేటు ఆసుపత్రులతో కలిపి మొత్తం 165 నెట్‌వర్క్‌ ఆసుప త్రుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద 2,434 రకాల వ్యాధులకు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. కొన్ని వ్యాధులకు పోస్టు ఆపరేటివ్‌ కింద రెండున్నర నెలలపాటు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏడాదిన్నర కాలంగా ఆరోగ్యశ్రీ కింద రూ. 183.84 కోట్ల విలువైన 75,872 సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. 

Updated Date - 2020-11-25T06:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising